News October 13, 2025
ములుగు: కాంట్రాక్టుల కోసమే మేడారంలో మంత్రుల హడావుడి: బడే నాగజ్యోతి

మేడారంలో కాంట్రాక్టు పనులు, కమీషన్ల కోసమే మంత్రులు హడావుడి చేస్తున్నారని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బడే నాగజ్యోతి ఆరోపించారు. నేటి మంత్రుల పర్యటన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి మధ్య వివాదమే దీనికి నిదర్శనమన్నారు. మేడారం విశ్వాసం, ఆదివాసీల అస్తిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Similar News
News October 13, 2025
VZM: ఉద్యోగాల భర్తీకి ఈ నెల 16న కౌన్సిలింగ్

ప్రభుత్వ మెడికల్ కాలేజ్, సర్వజన ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలలో 91 ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 16న ఉ.11 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని ప్రిన్సిపాల్ దేవి మాధవి సోమవారం తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ప్రిన్సిపాల్ కార్యాలయానికి ఒరిజినల్ సర్టిఫికేట్లు, జిరాక్స్ కాపీలు, 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. కౌన్సెలింగ్ జాబితాలు http://vizianagaram.nic.in, అందుబాటులో ఉన్నాయన్నారు.
News October 13, 2025
ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
News October 13, 2025
వనపర్తి: బాణసంచా దుకాణం దారులకు ఎస్పీ సూచనలు

✓ తప్పకుండా సంబంధిత పోలీసు అధికారి అనుమతి తీసుకోవాలి.
✓ ఖాళీ ప్రదేశాల్లో మాత్రమే షాపులు ఏర్పాటు చేయాలి – NOC తప్పనిసరి.
✓ ఒక క్లస్టర్లో 50 షాపులకు మించరాదు.
✓ జనరద్దీపదేశాలు, జనావాస ప్రాంతాల్లో షాపులు పెట్టకూడదు.
✓ ఇసుక, నీరు, 2 ఫైర్ ఎక్స్‌ట్రీమిషన్‌లు తప్పనిసరి.
✓ ఫైర్, విద్యుత్, మున్సిపల్ శాఖల NOC తీసుకోవాలి.
✓ లైసెన్స్ 3రోజులు మాత్రమే చెల్లుతుంది.
✓ 18 ఏళ్లు పైబడిన వారే షాపుల్లో పనిచేయాలి.