News November 10, 2025

ములుగు గజ గజ.. పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

అకాల వర్షాలతో ఆగమైన ప్రజలకు చలి రూపంలో మరో విపత్తు ఎదురవుతోంది. రేపటి నుంచి పది రోజులపాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పగలు, రాత్రి సమయాల్లో 10-14 డిగ్రీలు పడిపోతుందని పేర్కొంది. ఈరోజు నుంచే ములుగు ఏజెన్సీలో చలి ప్రభావం మొదలైంది. ఉదయం బారేడు పొద్దెక్కినా ఎక్కిన చలి ప్రభావం తగ్గలేదు. గోదావరి పరివాహక అటవీ మండలాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది.

Similar News

News November 10, 2025

వరంగల్ ప్రాముఖ్యతను వివరించిన అందెశ్రీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పేరుగాంచిన పల్లెలను కీర్తిస్తూ అందెశ్రీ రచించిన ‘గలగల గలగల గజ్జెలబండి ఘల్లు చూడు.. ఓరుగల్లు చూడు’ అనే పాట ఆయన లేడని ఘోల్లుమంటోంది. ‘కాకతీయులు ఏలిన ఖిల్లా వరంగల్, వేయిస్తంభాల గుడి, పెంబర్తి హస్తకళలు, రజాకార్లను తరిమికొట్టిన మద్దూరు మండలంలోని వీరబైరాన్ పల్లినీ, జాతీయ విప్లవకారులనుగన్న జాగోరే జనగామను చూడు’ అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను ఈ పాటలో చాటి చెప్పారు.

News November 10, 2025

అందెశ్రీకి కోదాడతో విడదీయరాని బంధం

image

రచయిత అందెశ్రీ మృతి పట్ల కోదాడ ‘తెర’ సాంస్కృతిక కళామండలి వ్యవస్థాపక అధ్యక్షుడు వేముల వెంకటేశ్వర్లు సంతాపం తెలిపారు. కోదాడ, ‘తెర’తో అందెశ్రీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఇటీవల దశాబ్ధి వేడుకల్లో ఆయన పాల్గొని ఆట, పాటను గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. “జై బోలో తెలంగాణ” పాట నిప్పులవాగై ప్రవహించిందని, “చూడ చక్కనితల్లి”, “కొమ్మ చెక్కితే బొమ్మరా” పాటలు సజీవమని కొనియాడారు.

News November 10, 2025

ప్రారంభమైన మార్కెట్.. తగ్గిన పత్తి ధర

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌‌కు పత్తి స్వల్పంగానే తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. నేడు క్వింటా పత్తి ధర రూ.6,800 పలికినట్లు పేర్కొన్నారు. గత వారం గరిష్టంగా పత్తి ధర రూ. 6,950 పలకగా.. నేడు భారీగా పడిపోయింది. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.