News March 11, 2025
ములుగు: గిరిజన యూనివర్సిటీ వీసీ నియామకం

ములుగు జిల్లా సమక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి మొదటి వైస్ ఛాన్సలర్‌ను భారత ప్రభుత్వం/ కేంద్ర విద్యా శాఖ నియమించింది. హైదరాబాదులోని ఆరోరా హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అకాడమీకి చెందిన ప్రొఫెసర్ యెడవల్లి లక్ష్మీ శ్రీనివాస్‌ను నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Similar News
News January 3, 2026
బాపట్ల: KGBV నోటిఫికేషన్.. ఖాళీల వివరాలు

బాపట్ల జిల్లాలో 4 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో (KGVB) 4 ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.
News January 3, 2026
అన్నమయ్య: డ్రోన్ కెమెరాతో తనిఖీలు

అన్నమయ్య జిల్లాలోని విద్యాసంస్థల వద్ద డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచి ఆకతాయిల ఆటకట్టిస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మదనపల్లె, పీలేరు, రాయచోటి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యా సంస్థలవద్ద డ్రోన్‌తో శుక్రవారం తనిఖీలు చేశారు. ఆకతాయిల ఆగడాలు, ఈవ్ టీజింగ్‌ను అరికడతామన్నారు.
News January 3, 2026
అల్లూరి జిల్లాలో 106 ఉద్యోగాలు.. వివరాలు ఇలా

అల్లూరి జిల్లాలో 106 ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. టైప్-3 కస్తూర్బాగాందీ విద్యాలయాల్లో(KGVB) 39, టైప్-4 కేజీబీవీల్లో 67 పోస్టింగ్‌లను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అప్లికేషన్లు జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు.


