News February 8, 2025

ములుగు: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

Similar News

News April 5, 2026

ఈ నెల 6- 11 వరకు ఆరోగ్య వారోత్సవాలు

image

ఏప్రిల్ 6- 11 వరకు నగరవ్యాప్తంగా భారీ ఆరోగ్య వారోత్సవాలు జరగనున్నాయి. నెక్లెస్ రోడ్‌లో ‘ఈట్ రైట్ వాక్’తో మొదలై, నిమ్స్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స పరికరాల ప్రారంభం, రవీంద్రభారతిలో AI సాంకేతికతతో ఊపిరితిత్తుల క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటాయి. ఎర్రగడ్డలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనం, గాంధీ ఆస్పత్రిలో డీ అడిక్షన్ కేంద్రం షురూ అవుతాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తారు.

News April 5, 2026

అసలు కిక్కు HYD గల్లీల్లోనే మామా!

image

జూబ్లీహిల్స్ ఆర్ట్ ఫెస్టివల్‌లో జనం హడావుడి మామూలుగా లేదు. అసలు కిక్కు మాత్రం గల్లీల్లోని చిన్న స్టూడియోల్లో ఉంది. కాక్‌టెయిల్స్ పక్కనపెట్టి, చాయ్‌తో చిల్ అవుతూ యంగ్ ఆర్టిస్టులు, AI డిజైనర్లు ‘సైలెంట్ రివల్యూషన్’ చేస్తున్నారు. గ్లాస్ బిల్డింగులు, కెఫేల మధ్య పాత పాన్‌షాపులు, హాస్టల్ బాల్కనీలు మాయమైపోకుండా ఆర్ట్‌తో సేవ్ చేస్తున్నారు. మన రూట్స్ మర్చిపోకూడదని వీళ్లు చేస్తున్న ఈ గల్లీ పోరాటం మాస్ మామా!