News September 15, 2025
ములుగు గ్రీవెన్స్‌లో 71 దరఖాస్తులు

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వేకరించారు. మొత్తం 71 దరఖాస్తులు రాగా.. అందులో 26 రెవిన్యూ, 6 ఇందిరమ్మ ఇళ్లు, 7 పెన్షన్, 6 ఉద్యోగం, 26 ఇతర సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి.
Similar News
News September 16, 2025
సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.
News September 16, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News September 16, 2025
ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.