News May 7, 2025
ములుగు: చర్చలు జరపండి.. ‘మావో’ లేఖ

తెలంగాణ సరిహద్దు కర్రెగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు నార్త్ వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో రూపేశ్ పేరుతో శుక్రవారం లేఖను విడుదల చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలని, తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించే మార్గాన్ని అనుసరించి అనుకూల వాతావరణాన్ని కల్పించాలన్నారు. ఒక నెలపాటు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Similar News
News March 7, 2026
జగిత్యాల: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి’

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలుపై కరీంనగర్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జిల్లాలో కార్యక్రమం అమలుకు తీసుకుంటున్న చర్యలు, కార్యాచరణ ప్రణాళికను వివరించారు.
News March 7, 2026
నటుడు మురళీధర్ భార్య కన్నుమూత

ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీధర్ గౌడ్ భార్య శశికళ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారు. దీంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన మురళీధర్ రిటైర్మెంట్ తర్వాత నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు చేశారు. రంగ స్థలం, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, బలగం, మ్యాడ్, మేం ఫేమస్ తదితర చిత్రాలతో గుర్తింపు పొందారు.
News March 7, 2026
పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్ కీర్తి చేకూరి

మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. ప్రశ్నపత్రాల భద్రతకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల పోలీసు పహారా, రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు.


