News January 30, 2025

ములుగు: చలిమంటల్లో పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

చలి మంటల్లో పడి విద్యార్థి కాళ్లకు తీవ్ర గాయాలైన ఘటన ములుగు జల్లా ఏటూరునాగారం మండలం మల్యాల ఆశ్రమ పాఠశాలలో గురువారం రాత్రి జరిగింది. 3వ తరగతి చదువుతున్న భూదేశ్ అనే గుత్తికోయ విద్యార్థి చలి వేస్తుందని పాఠశాల ఆవరణలో చలిమంటల కోసం ఎండు గడ్డికి నిప్పు పెట్టారు. ఈ క్రమంలో అదుపుతప్పి భూదేశ్ మంటల్లో పడగా 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News February 26, 2026

భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతల స్వీకారం

image

యాదాద్రి భువనగిరి నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా, GHMC జోనల్ కమిషనర్‌గా పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాను సమగ్ర అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని వెల్లడించారు.

News February 26, 2026

NGKL: గడ్డి ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

image

కొల్లాపూర్ మండలంలోని సింగోటం గ్రామ శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. చుక్కాయిపల్లికి చెందిన బింగి ఉషన్న యాదవ్ (58), కొల్లాపూర్‌కి చెందిన సమ్మద్ (40) వనపర్తి నుంచి తిరుగు ప్రయాణంలో ఉండగా లక్ష్మీదేవిఅమ్మ గుట్ట మలుపు వద్ద గడ్డి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. తీవ్ర గాయాలవడంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News February 26, 2026

HYD: అడవిలో ఒక రాత్రి.. ఈ ఆదివారం క్యాంప్!

image

ప్రకృతి ప్రేమికులకు మంచిరేవుల పార్క్ అదిరిపోయే ఆఫర్. ​వీకెండ్‌లో కాంక్రీట్ జంగిల్ వదిలి అసలైన అడవిలోకి వెళ్లాలనుందా? మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్‌లో ఈ నెల 28న రాక్ బే నేచర్ క్యాంప్ ఉంది. నైట్ క్యాంపింగ్, క్యాంప్ ఫైర్, ట్రెక్కింగ్‌తో పాటు మార్చి 1న ఉదయం ‘బర్డ్ వాక్’ సందడి ఉంటుంది. నిపుణులతో కలిసి పక్షుల లోకాన్ని చూడొచ్చు. రూ.1199(పిల్లలు), రూ.1999 (పెద్దలు). బర్డ్ వాక్ ఫీజు రూ.450 మాత్రమే.