News October 22, 2025
ములుగు: చెల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తూ.. అక్క మృతి

ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18068173>>ఇంటర్ విద్యార్థిని<<>> సింధూజ మృతిచెందిన విషయం తెలిసిందే. కన్నాయిగూడెం మం. చిట్యాల వాసి సింధూజ(17) చెల్లి శ్రీపూజకు తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి గ్రామానికి చెందిన యువకుడు కృష్ణారావు సాయం కోరింది. ముగ్గురు కలిసి ఆస్పత్రికి బైక్‌పై వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే సింధూజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Similar News
News October 22, 2025
సంగారెడ్డి: రేపు స్కౌట్ అండ్ గైడ్స్ పై శిక్షణ కార్యక్రమం

స్కౌట్ అండ్ గైడ్స్ కింద ఎంపికైన 38 పాఠశాలల నుంచి పాఠశాలల పీఈటీలకు గురువారం కలెక్టరేట్‌లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. పీఈటీలు సమయానికి శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు.
News October 22, 2025
ADB: ఆరోగ్య పాఠశాలపై కలెక్టర్ సమీక్ష

ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆరోగ్య పాఠశాల సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజార్షి షా హాజరై ఆరోగ్య పాఠశాల కార్యక్రమ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మెరుగైన ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆయన స్వయంగా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అజయ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
News October 22, 2025
సదర్.. దద్దరిల్లనున్న నారాయణగూడ

సదర్‌కు హైదరాబాద్ సిద్ధమైంది. నారాయణగూడ YMCA చౌరస్తాలో ప్రత్యేకంగా 4 వేదికలు ఏర్పాటు చేశారు. చెప్పల్‌బజార్, కాచిగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్‌తో పాటు నగర నలుమూలల నుంచి యాదవులు వేలాదిగా ఇక్కడికి తరలిరానున్నారు. దేశంలోనే పేరుగాంచిన దున్నరాజులను ప్రదర్శిస్తారు. భారీ లైటింగ్, నృత్యాలు, దున్నరాజులతో యువత విన్యాసాలు సదర్ వైభవాన్ని మరింత పెంచుతాయి. అర్ధరాత్రి వరకు డప్పుల మోతతో నారాయణగూడ దద్దరిల్లనుంది.