News October 15, 2025

ములుగు: చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు

image

జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లలు వదులుటకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజు తెలిపారు. గత 12న చేప పిల్లల పంపిణీ టెండర్లు పూర్తి అయ్యాయన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తేదీ ప్రకటించగానే టెండర్ దారులు చేపల పంపిణీ ప్రక్రియ చేపడతారని తెలిపారు.

Similar News

News October 16, 2025

నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

image

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్‌కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.

News October 16, 2025

వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

image

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.

News October 16, 2025

గద్వాల: కరెంట్ షాక్‌తో మహిళ మృతి

image

గద్వాల పట్టణంలోని బీసీ కాలనీలో దుర్గమ్మ (30) అనే మహిళ కరెంట్ షాక్‌తో బుధవారం మృతిచెందిందని స్థానికులు తెలిపారు. భర్త ఎల్లప్పతో కలిసి దుర్గమ్మ గతంలో నంద్యాల నుంచి గద్వాలకు బతుకుదెరువు నిమిత్తం వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.