News November 7, 2025
ములుగు జిల్లాకు ఎంపీఓల కేటాయింపు

ములుగు జిల్లాకు ముగ్గురు నూతన మండల పంచాయతీ అధికారుల(ఎంపీఓ)ను ఉన్నతాధికారులు కేటాయించారు. ఏటూరునాగారం ఎంపీఓగా పి.వినయ్, తాడ్వాయికి జి.మహేందర్, నూగురు వెంకటాపురానికి జి.జమ్మిలాల్‌ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం నూతన ఎంపీఓలు కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్-2 అధికారులు జిల్లాకు ఎంపీఓగా రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
PCOD, PCOS రాకుండా ఉండాలంటే?

మారిన జీవనశైలి వల్ల చాలామంది అమ్మాయిలు PCOD, PCOS సమస్యలతో బాధపడుతున్నారు. వీటిని నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అధిక బరువుంటే వ్యాయామం చేస్తూ, సమతుల ఆహారం తీసుకుని బరువు తగ్గాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.
News November 7, 2025
SKLM: సెకండ్ సాటర్డే సెలవులు రద్దు

రానున్న ఏడాది ఫిబ్రవరి నెల వరకు సెకండ్ సాటర్డే సెలవులు ఉండవని డీఈవో కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేపు యథావిధిగా జిల్లాలో పాఠశాలలు నడుస్తాయన్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ సందర్భంగా సెలవులను వీటి ద్వారా భర్తీ చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వచ్చాయని, విద్యాసంస్థలు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన కోరారు.
News November 7, 2025
ప్రచారం తప్ప బాబు చేసిందేమీ లేదు: కన్నబాబు

AP: డేటా ఆధారిత పాలన అంటూ ప్రచారమే తప్ప CM CBN చేసిందేమీ లేదని మాజీ మంత్రి కన్నబాబు విమర్శించారు. ‘500 వాట్సాప్ సేవల ద్వారా ఆన్లైన్లోనే సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతున్నారు. మరి లోకేశ్ ప్రజాదర్బార్‌కు 4వేల అర్జీలు ఎందుకు వచ్చాయి? ప్రతిసారీ ఓ కొత్తపదంతో పబ్లిసిటీ చేసుకుంటూ మోసగించడం చంద్రబాబుకు అలవాటు’ అని విమర్శించారు. సచివాలయం వంటి వ్యవస్థలను తెచ్చి జగన్ చరిత్రలో నిలిచారన్నారు.


