News August 28, 2025
ములుగు జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

ములగు జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. వాగులు, వంకలు, కాజ్‌వేలు దాటొద్దని హెచ్చరించారు. వరదలు వచ్చే అవకాశం ఉన్న రోడ్లను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో కలెక్టరేట్ టోల్ ఫ్రీ నంబర్ 18004257109కి కాల్ చేయవచ్చని తెలిపారు.
Similar News
News August 28, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

TG: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31న ఆయన రిటైర్ కావాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనతో సర్వీసును 7 నెలలు పొడిగించింది. దీంతో రామకృష్ణారావు వచ్చే ఏడాది మార్చి వరకు పదవిలో కొనసాగనున్నారు.
News August 28, 2025
తిరుపతి: బాలికపై అత్యాచారం.. 26 ఏళ్ల జైలుశిక్ష

తిరుపతి జిల్లా చిల్లకూరు(M) తీపనూరుకు చెందిన కన్నా శ్రీనివాసులు(21) మైనర్ బాలికపై కన్నేశాడు. 2021 జులై 14న బాలిక తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న బాలికను శ్రీనివాసులు కిడ్నాప్ చేసి వరగలి క్రాస్ రోడ్ ప్రాంతంలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. నేరం రుజువు కావడంతో అతనికి 26ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ నెల్లూరు పోక్సో కోర్టు జడ్జి సుమ గురువారం తీర్పు చెప్పారు.
News August 28, 2025
NLG: ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు ఈనెల 30 చివరి తేదీ

నల్గొండ ఎన్జీ కాలేజీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్‌లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 30వ తేదీ చివరి గడువు అని ప్రిన్సిపల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మరిన్ని వివరాల కోసం 7382929610, 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.