News October 5, 2025
ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

ములుగు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటున ప్రతి మండలంలో 2.7 సెంటీమీటర్ల వాన పడింది. అత్యధికంగా ఏటూరునాగారం మండలంలో 10.8 సెంటీమీటర్లు, వాజేడులో 3.4, మంగపేటలో 3.0, వెంకటాపురంలో 2.5, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి మండలాల్లో 1.1 సెంటీమీటర్ చొప్పున వర్షం పడింది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News October 5, 2025
మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.
News October 5, 2025
PGRSను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రతి మండల స్థాయి, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలలో PGRS నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అర్జీల సమాచారానికి ప్రజలు కాల్ నం.1100 ఫోన్ చేయవచ్చన్నారు.
News October 5, 2025
రోహిత్ శర్మ 45-77 ట్వీట్ వైరల్

13 ఏళ్ల కిందట హిట్‌మ్యాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. నిన్న రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ గిల్‌ను IND వన్డే సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా 45 శకం ముగిసిందని, 77 జర్నీ మొదలైనట్లు రోహిత్ 2012లో ట్వీట్ చేశారు. రోహిత్ జెర్సీ నంబర్ 45 కాగా, గిల్‌ది 77. అయితే ఆ సమయంలో రోహిత్ ఎందుకలా ట్వీట్ చేశారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.