News April 15, 2025
ములుగు జిల్లాలో గుడుంబా కేసులెన్నో తెలుసా?

గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ములుగు ఎస్పీ శబరీశ్ అన్నారు. జిల్లాలో గత ఏడాది 2024లో గుడుంబా తయారీ, విక్రయ దారులపై 184 కేసులు నమోదు చేసి, 3023 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 216 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 10 వరకు 62 కేసులు నమోదు చేసి, 1426 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామన్నారు. 62 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News July 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 5, 2025
ఓదెల: ప్రభుత్వ పాఠశాలల ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

ఓదెల మండలంలోని పాఠశాలల పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెడ్‌మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను అమలు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మ్యాథ్స్, ఆంగ్లం, తెలుగు విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. టీచర్ల హాజరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలని, పాఠశాలల మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని, హాజరును 60%కి పెంచాలని ఆదేశించారు.
News July 5, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 5, శనివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.25 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.47 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.16 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.