News February 7, 2025
ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ రె’ఢీ’

గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార యంత్రాంగం, వివిధ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. మన ములుగు అసెంబ్లీ పరిధిలో 09 మండలాలు ఉండగా 09 జడ్పీటీసీ స్థానాలు, 09 ఎంపీపీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 175 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా కొన్ని మండలాల్లో నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈనెల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండటంతో గ్రామాల్లో ఇప్పటికే సందడి మొదలైంది.
Similar News
News March 1, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 1, 2026
NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.
News March 1, 2026
మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్.. వార్ జోన్‌లో 80లక్షల మంది భారతీయులు!

US, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వార్ జోన్‌లో ఉన్న దేశాల్లో దాదాపు 80లక్షల మంది భారతీయులు ఉన్నారు. యూఏఈలో 35.5లక్షలు, సౌదీ అరేబియాలో 24.6లక్షలు, ఖతార్‌లో 8.4లక్షలు, కువైట్‌లో 9.9 లక్షలు, జోర్డన్‌లో దాదాపు 17వేలు, ఇజ్రాయెల్‌లో 20వేలు, ఇరాన్‌లో 10వేల మంది భారతీయులు ఉన్నారు. కాగా భారత విదేశాంగ శాఖ అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.


