News March 1, 2025
ములుగు జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ములుగు జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 37 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 6, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి: పెద్దపల్లి కలెక్టర్

మంథని నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్కింగ్ చేసిన ఇళ్లు, బేస్మెంట్ స్థాయికి చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని, నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల ఇళ్లు రద్దు చేయాలని ఆదేశించారు. పెట్టుబడి సమస్యలుంటే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందించాలని సూచించారు. నిర్మాణ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 6, 2025
పిల్లలకు మెరుగైన విద్య అందించాలి: పెద్దపల్లి కలెక్టర్

పిల్లలకు మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత కలెక్టరేట్‌లో 22 పాఠశాలల హెడ్ మాస్టర్లతో విద్యా ప్రమాణాల పెంపుపై సమీక్ష నిర్వహించారు. అత్యుత్తమంగా పనిచేస్తున్న పాఠశాలలను అభినందించి, మంచి ఫలితాల కోసం ఇతర పాఠశాలల టీచర్లను ప్రోత్సహించాలని చెప్పారు. మచ్చుపేట పాఠశాలకు ఆటో ఏర్పాటు, ఏఎక్స్ఎల్ ల్యాబ్ ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
News November 6, 2025
KNR: ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి.. అయినా ఈ పరిస్థితి..!

ఉమ్మడి KNR జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉందో తెలిపే ఘటన ఇది. మానకొండూరు(M) పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థినులు బస్సులు లేక రాత్రయినా రోడ్డుపై ఎదురుచూస్తూ కనిపించారు. అసలే చీకటి,సీసీ కెమెరాలు లేని ప్రాంతం, అమ్మాయిల భద్రతకు బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.ముగ్గురు మంత్రులు, ఒక కేంద్రమంత్రి ఉన్న జిల్లాలో ఈపరిస్థితి ఏంటని అంటున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


