News December 17, 2025
ములుగు జిల్లాలో బోణీ కొట్టిన సీపీఎం

ములుగు జిల్లాలో మొదటిసారి సీపీఎం బోణీ కొట్టింది. వెంకటాపురం మండలం భోదాపురం గ్రామ పంచాయతీలో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోర్స నరసింహారావు గెలుపొందారు. నరసింహారావుకు 145 ఓట్ల మెజార్టీ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీపీఎం నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News December 19, 2025
కాకినాడ: మెసేజ్‌లకు స్పందించవద్దు- SP

ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లకు స్పందించవద్దు అని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మారుతున్న సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వారి నేర విధానాన్ని మార్చుకుంటూ ప్రజలను మోసం చెయ్యడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని తెలిపారు.
News December 19, 2025
బాపట్ల కలెక్టర్‌కు సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అవార్డు

బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ గవర్నర్ చేతుల మీదుగా సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అవార్డును అందుకున్నారు. శుక్రవారం లోక్ భవన్‌లో జరిగిన సాయి దళాల పతాక దినోత్సవ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి భారీగా విరాళాలు సేకరించినందుకు ఆయనకు గవర్నర్ ఈ అవార్డును ప్రధానం చేశారు. కలెక్టర్‌కు జిల్లా అధికారులు, ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.
News December 19, 2025
ఏలూరు: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

వ్యక్తిని రాడ్‌తో కొట్టి చంపిన ఘటనలో ఇద్దరికి జిల్లా న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. ఏలూరు తూర్పు వీధికి చెందిన తిరుమల రామ శివ, కలవల నాగరాజులు 2018 మే 17 తేదీ రాత్రి వైన్ షాపు వద్ద యాదాద్రి శ్రీ హర్షతో గొడవపడి అతనిపై రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. వాదోపవాదములు విన్న తర్వాత జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి శుక్రవారం మధ్యాహ్నం వీరికి జీవిత ఖైదు విధించారు.


