News February 26, 2025

ములుగు జిల్లా కలెక్టర్ సూచన 

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జిల్లాలోని 9 పోలింగ్ కేంద్రాలకు సరిపడా సిబ్బందిని నియమించడంతో పాటు మరో 20 శాతం అదనపు సిబ్బందిని రిజర్వులో ఉంచామన్నారు. జిల్లాలో 628 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని వివరించారు.

Similar News

News February 26, 2025

నరసాపురం : మహిళ కడుపులో ఏడు కేజీల కణితి 

image

నరసాపురం మండలం సారవ గ్రామానికి చెందిన మహిళ కడుపు నొప్పితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పరీక్షలు చేసి కడుపులో దాదాపు ఏడు కేజీల కణితి ఉందని నిర్ధారించారు. మంగళవారం మహిళకి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న ఏడు కేజీల కణితిని తొలగించారు. ప్రస్తుతం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని గైనకాలజిస్ట్ డా.అద్దంకి విజ్ఞాని తెలిపారు.

News February 26, 2025

BREAKING: వేములవాడకు పోటెత్తారు..!

image

వేములవాడలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతర నేపథ్యంలో ఈరోజు శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేములవాడకు వచ్చే దారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆలయంలోని క్యూలైన్ల కంపార్ట్‌మెంట్లు కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా భక్తులు తరలివస్తుండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. ఆలయ ప్రాంగణమంతా శివ నామస్మరణతో మార్మోగుతోంది.

News February 26, 2025

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారం చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార గడువు ముగిసినందున జిల్లాలో ఎక్కడైనా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో ఎక్కడా కూడా పార్టీ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. బల్క్ ఎస్ఎంఎస్‌లు కూడా పంపవద్దని అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

error: Content is protected !!