News April 25, 2024

ములుగు జిల్లా టాప్

image

ఇంటర్ సెకండీయర్ ఫలితాల్లో రాష్ట్రంలో ములుగు ప్రథమ స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 1,695 మంది పరీక్ష రాయగా.. 1,406 మంది పాసయ్యారు. 928 మంది బాలురకు గాను 729 మంది(78.56 శాతం) పాసవ్వగా.. 767 మంది బాలికలకు గానూ 677 మంది(88.27శాతం)తో పాసయ్యారు.

Similar News

News January 7, 2025

వరంగల్: ఎయిర్‌పోర్టు కోసం స్థల పరిశీలన

image

మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కావాల్సిన నిధులను, జీవోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విమానాశ్రయం నిర్మాణానికి కావాల్సిన భూమిని అధికారులు సోమవారం పరిశీలించారు. ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆనందం, కీర్తన్, సర్వేయర్ రజిత, ఏఈఈ రాజ్ కుమార్ తదితరులున్నారు.

News January 6, 2025

HNK: సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ

image

హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వరాలయంలో సోమవారం సిద్దేశ్వరుడికి ప్రత్యేక అలంకరణ, పూజా కార్యక్రమాలను చేపట్టారు. పలువురు భక్తులు సిద్దేశ్వరుడిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా అర్చకులు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.

News January 6, 2025

WGL: క్వింటా మొక్కజొన్న ధర రూ.2,565

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌‌లో మక్కలు(బిల్టీ) క్వింటాకు సోమవారం రూ.2,565 ధర పెరిగింది. అలాగే కొత్త తేజ మిర్చి ధర గతవారంలాగే రూ.15,500, కొత్త 341 రకం మిర్చికి రూ.15,011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. చలికాలం నేపథ్యంలో రైతులకు జాగ్రత్తలు పాటిస్తూ సరుకులు తీసుకొని రావాలని అధికారులు సూచిస్తున్నారు.