News February 4, 2025
ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బలరాం
బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంను నియమిస్తూ పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ కౌన్సిల్ సభ్యులుగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు భూక్యా జవహర్ లాల్‌ను నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన ములుగుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలరామును అధ్యక్షుడిగా నియమించడం విశేషం.
Similar News
News February 4, 2025
రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా
TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <
News February 4, 2025
జంగంపల్లి చెరువులో మృతదేహం కలకలం
బిక్కనూర్ మండలం జంగంపల్లి పెద్ద చెరువులో మంగళవారం గుర్తు తెలియని శవాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికులు గ్రామపంచాయతీ సిబ్బందికి సమాచారం అందించగా పంచాయతీ కార్యదర్శి గుడిసె బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 4, 2025
బషీరాబాద్‌లో దారుణ హత్య
బషీరాబాద్ మండలంలోని నవల్గా గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాళ్లతో మోది మాల శ్యామప్పను చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.