News January 11, 2026
ములుగు జిల్లా రద్దు నిజమేనా..?

ఆరు ముక్కలుగా విభజించిన ఉమ్మడి వరంగల్ జిల్లాను మళ్లీ అతికించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రచారం జోరందుకోవడంతో వరంగల్, హనుమకొండలను విలీనం చేయడంతో పాటుగా, భూపాలపల్లి జిల్లాలో ములుగును విలీనం చేయాలని చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నో గొడవల నేపథ్యంలో ఏర్పాటైన ములుగు జిల్లాకు మంగళం పాడే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
Similar News
News February 17, 2026
BREAKING.. మంచిర్యాలలో భర్తను చంపిన భార్య..!

మంచిర్యాల జిల్లా మందమర్రి శాంతినగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్తనే ఓ భార్య అతికిరాతకంగా కత్తితో నరికి చంపింది. మోయిన్, అవంతి మతాంతర ప్రేమ వివాహం చేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరి వివాహేతర సంబంధం ఆ కుటుంబంలో చిచ్చు రేపింది. కాగా ఈ హత్యకు వేధింపులే కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మంచిర్యాల ఆస్పత్రిలో మోయిన్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 17, 2026
వర్ధన్నపేట మున్సిపాలిటీలో 25 ఏళ్లకే కౌన్సిలర్‌గా!

వర్ధన్నపేట మున్సిపాలిటీలో చిలువేరు రమా రాజశేఖర్ 25 ఏళ్ల వయసులోనే కౌన్సిలర్‌గా చిన్న వయసులో ప్రజాప్రతినిదిగా నిలిచారు. 9 వార్డు నుంచి పోటీ చేసిన ఈమె.. రాజకీయాలపై అంతలా అనుభవం లేకపోయినా అక్కడివారి సామాజిక వర్గం పట్టం కట్టారు. డిగ్రీ చదివిన రమాకు బీఆర్ఎస్ నుంచి అవకాశం దక్కింది. చదువుకున్న వ్యక్తి కావడంతో వార్డు ప్రజల ఆశలు ఆమె పైనే ఉన్నాయి. అభివృద్ధి తన మార్క్ ఎలా చూపెడుతుందో చూడాలి.
News February 17, 2026
HYD: జేఈఈ మెయిన్స్‌లో Resonance ప్రభంజనం!

JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాల్లో హైదరాబాద్ Resonance విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 55 మందికి పైగా విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు మించి స్కోరు చేసి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. సమృద్ధి భట్టాచార్య 99.988, రేవంత్ వంగల 99.982, సాకేత్ రెడ్డి 99.932, ఆదిత్య రెడ్డి 99.918, అన్విత రెడ్డి 99.915 అగ్రస్థానంలో నిలిచారు. క్రమశిక్షణతో కూడిన శిక్షణే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.


