News November 19, 2025

ములుగు: జీరంఘాటి ఘటన వెనక మడవి హిడ్మానే

image

మడవి హిడ్మా నాయకత్వం వహించిన అనేక ఘటనల్లో జీరంఘాటి ఘటన దేశవ్యాప్తంగా సంచలం సృష్టించింది. జగదల్పూర్ సమీపంలోని దర్భాఘాట్ వద్ద 2013 మే 25న కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పరివర్తన యాత్రలో భాగంగా 25 వాహనాల్లో వెళ్తున్న కాన్వాయిని మావోయిస్టులు పేల్చి వేశారు. ఈ ఘటనలో మాజీ కేంద్రమంత్రి చరణ్ శుక్లా, రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మ, నంద్ కుమార్ పటేల్, ఉదయ్ ముదలియార్, గోపి మద్వానీ, పూలో దేవి హతమయ్యారు.

Similar News

News November 20, 2025

జిల్లాలో గత 4 నెలలో 7,432 ఎపిక్ కార్డులు: కలెక్టర్

image

జిల్లాలో ఓటరుగా నమోదు చేసుకున్న వారికి గత నాలుగు నెలల్లో 7,432 ఎపిక్ కార్డులను పంపినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిగిన సమీక్షలో ఆమె వివరాలను వెల్లడించారు. ఓటు నమోదుకు వచ్చిన 3,334 దరఖాస్తుల్లో 2,800 దరఖాస్తులను ఆమోదించామని, 426 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయని, మరో 108 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

News November 20, 2025

SRCL: యాత్రికుల భద్రతే మొదటి ప్రాధాన్యత: ASP

image

స్వామివారి దర్శనం కోసం వేములవాడకు వచ్చే యాత్రికుల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తామని అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తెలిపారు. భీమేశ్వర ఆలయం ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, 12 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 32 సీసీ కెమెరాలను స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులతో కలిసి పనిచేస్తామని ASP స్పష్టం చేశారు.

News November 20, 2025

MBNR: రేపు డయల్ యువర్ RM

image

ఆర్టీసీ సమస్యలపై ‘డయల్ యువర్ RM ” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాలమూరు రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ “Way2News”తో తెలిపారు. ఈనెల 21న సాయంత్రం 4:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఆర్టీసీ సమస్యలు, సూచనల కోసం 99592 26295కు సంప్రదించాలన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.