News September 11, 2025

ములుగు: ట్రైబల్ వర్సిటీకి భవన నిర్మాణం ఎప్పుడు..?

image

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు కేటాయించిన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సొంత భవనం కరవైంది. వనదేవతలు సమ్మక్క, సారక్క పేరు పెట్టిన ఈ యూనివర్సిటీకి ములుగు శివారులో 330 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రం రూ.889 కోట్లు కేటాయించింది. కానీ, పనులు ఇంకా ప్రారంభం కాలేదు. జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటు చేశారు. బీఏ-ఇంగ్లిష్, ఎకనామిక్స్ కోర్సులున్నాయి.

Similar News

News September 11, 2025

పెట్టుపోతలకు చెక్ పెడదాం

image

మనదేశంలో చాలా పోరాటాల తర్వాత 1961లో వరకట్ననిషేధ చట్టం వచ్చింది. ఇందులో సెక్షన్ 2 ప్రకారం పెళ్లిలో విలువైన వస్తువులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుంటే అది భార్య, వారసుల కోసమే వాడాలి. సెక్షన్ 3 ప్రకారం కట్నం తీసుకున్నట్లు రుజువైతే ఫైన్, జైలుశిక్ష పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం కట్నం డిమాండ్ చేయడం నేరం. సెక్షన్ 6 ప్రకారం పెళ్లిలో తీసుకున్న ఆస్తి, డబ్బు 3నెలల్లో అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలి.

News September 11, 2025

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్?

image

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీసింగ్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆ దేశ మీడియా తెలిపింది. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి, కాఠ్‌మండూ మేయర్ బాలేంద్ర షా, విద్యుత్ అథారిటీ మాజీ చీఫ్ కుల్మాన్ ఘీసింగ్ పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్మీకి Gen Z సూచించినట్లు తెలుస్తోంది.

News September 11, 2025

కేయూ మొదటి గేటు ఎదుట BRSV ధర్నా

image

గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, వెంటనే పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులను స్థానిక పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.