News March 19, 2024

ములుగు: డీఎల్ఎస్ఏలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ములుగు జిల్లాలోని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ( డిఎల్ఎస్ఎ)లో మూడు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆఫీస్ అసిస్టెంట్, రిసెప్షనిస్ట్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, ఏదేని డిగ్రీతో పాటు టైపింగ్‌లో అనుభవం ఉండాలన్నారు.

Similar News

News July 3, 2024

ములుగు జిల్లా పేరు మార్పు.. మీరేమంటారు?

image

ములుగు జిల్లా పేరు మార్పుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో నేడు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించి అధికారులు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈమేరకు సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చుతూ ఇప్పటికే అధికారులు పబ్లిక్ నోటీసులు జారీ చేశారు. మరి జిల్లా పేరు మార్పుపై మీరేమంటారు. కామెంట్‌లో తెలపండి

News July 3, 2024

తొర్రూరు: అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు

image

ప్రేమ పేరుతో బెదిరించి బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీష్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. డివిజన్ కేంద్రానికి చెందిన ఓ బాలికపై వాటర్ ప్లాంట్లో పనిచేసే ఇనుగుర్తి గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని ఎస్సై తెలిపారు.

News July 3, 2024

WGL: వాట్సాప్ నుంచే ఫిర్యాదు చేయొచ్చు: సీపీ

image

కొత్త చట్టాలపై WGL సీపీ అంబర్ కిషోర్ ఝూ కీలక అంశాలను వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. బాధితులు చేసిన ఫిర్యాదుల వివరాలను ఆన్‌లైన్లో పరిశీలించుకోవచ్చని తెలిపారు. బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, విచారించిన తర్వాత కోర్టు అనుమతితో కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.