News October 14, 2025

ములుగు డీసీసీపై ‘రెడ్డి’ కన్ను..?!

image

ములుగు డీసీసీ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లాడి రాంరెడ్డి ప్రయత్నం తీవ్రతరం చేశారు. మార్కెట్ కమిటీ, గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవులు ఎస్టీలకు కేటాయించడంతో మిగతా సామాజిక వర్గాల నేతలు తమ భవిష్యత్‌పై ఆందోళనలో ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్‌గా పైడాకుల అశోక్ రెండు పర్యాయలు పనిచేయగా.. ఈసారి మల్లాడికే అవకాశం వస్తుందనే ప్రచారం జరుగుతోంది.

Similar News

News October 14, 2025

విశాఖ: బంపర్ డ్రా.. లింక్ క్లిక్ చేస్తే..!

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ సిటీ పోలీసులు సూచించారు. లాటరీ, బంపర్ డ్రాలు గెలుచుకున్నారంటూ సైబర్ నేరగాళ్లు ఆశ చూపిస్తారని, అది నమ్మి లింక్‌ క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు కోల్పోతారని చెప్పారు. అటువంటి మెసెజ్‌లకు స్పందించవద్దని కోరారు. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు.

News October 14, 2025

వీటికి దూరంగా ఉంటే సంతోషమే!

image

మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ఇతరుల మీద ఫిర్యాదులు చేయడం, గుసగుసలు మాట్లాడటం, ఈర్ష్య, ఎదుటివారితో పోల్చుకోవడం, అతి వ్యసనాలు, అనుమానం, భయం, ద్వేషం’ వంటివి ‘మానసిక క్యాన్సర్ల’తో సమానం అని చెబుతున్నారు. ఇవి మన మనసును, శరీరాన్ని నెమ్మదిగా కుంగదీస్తాయంటున్నారు. వీటికి దూరంగా ఉంటే ఎంతో సంతోషంగా ఉంటారని సూచిస్తున్నారు. మీరేమంటారు?

News October 14, 2025

కోడూరు: ‘ట్రైన్‌లో నిద్రిస్తూనే కన్నుమూశాడు’

image

కోడూరు(M) పోటుమీదతకు చెందిన శీలం బాపనయ్య(65) షిరిడీ యాత్రకు వెళ్లి మంగళవారం ఉదయం మృతి చెందారు. సోమవారం ఇంటి వద్ద నుంచి తోటి యాత్రికులతో కలిసి షిరిడీ బయలుదేరారు. మంగళవారం షిరిడీ సమీపంలో నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌లో ట్రైన్ దిగేందుకు నిద్రిస్తున్న బాపనయ్యను లేపగా అప్పటికే మృతి చెందినట్లు తోటి వారు తెలిపారు. బాపనయ్య మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.