News February 4, 2025
ములుగు: తుడందెబ్బ మొదటి మహిళా అధ్యక్షురాలి మృతి
తుడుందెబ్బ మొదటి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కండేల మల్లక్క మంగళవారం మృతి చెందారు. ఎన్నో ఏళ్లుగా ఆదివాసీ అస్తిత్వం కోసం పోరాటం చేసి, ఆదివాసులకు హక్కులు కల్పించడంలో ఆమె ఎంతో కృషి చేశారని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి అన్నారు. మల్లక్క మృతి ఆదివాసీ సమాజానికి తీరని లోటన్నారు. ఆంధ్ర వలసదారులపై పోరాటం చేసి వెయ్యి ఎకరాల భూమిని ప్రజలకు పంచిదన్నారు.
Similar News
News February 4, 2025
హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా?: MLA పాయల్ శంకర్
TG: బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా? అని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కోర్టుల్లో కేసులు వేసి బీసీలకు రిజర్వేషన్ల పెంపును జాప్యం చేయాలని చూస్తున్నారు. టికెట్ల కేటాయింపు దగ్గర నుంచే బీసీలకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాలు లేని సీట్లను బీసీలకు కేటాయిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు.
News February 4, 2025
అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం
AP: రాష్ట్రంలో అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్ల నియామకం జరిగింది. పీఏసీ ఛైర్మన్‌గా పులపర్తి రామాంజనేయులు, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వేగుళ్ల జోగేశ్వరరావు, పీయూసీ ఛైర్మన్‌గా కూన రవికుమార్‌లను నియమిస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారికంగా ప్రకటించారు.
News February 4, 2025
బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం: తలసాని
TG: కులగణన సర్వే ద్వారా BCలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో 30 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని ఆయన అసెంబ్లీలో తెలిపారు. ‘ఈ సర్వే ప్రకారం BC, SC, ST జనాభా తగ్గినట్లు కనిపిస్తోంది. కులగణన సర్వేపై కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. సర్వే చేసి తీర్మానం చేస్తే సరిపోదు. ఇలాంటివాటికి చట్టబద్ధత కల్పించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.