News October 16, 2025
ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.
Similar News
News October 16, 2025
‘జగిత్యాల-తిరుపతి బస్సు సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

జగిత్యాల నుంచి తిరుపతికి ప్రతిరోజూ బస్సు సర్వీస్ అందుబాటులో ఉందని, ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం కల్పన తెలిపారు. జగిత్యాల నుంచి హైదరాబాద్‌కు ప్రతి గంటకు సూపర్ లగ్జరీ బస్సులు, శంషాబాద్‌కు రాజధాని ఏసీ బస్సులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ బస్సుల్లో సీట్లను ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News October 16, 2025
సిరిసిల్ల విద్యార్థి సంతోష్‌కు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం

సిరిసిల్ల విద్యార్థి సంతోష్‌కు రాష్ట్రస్థాయి పోటీల్లో అవకాశం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి 69వ ఎస్‌జిఎఫ్ (SGF) కబడ్డీ క్రీడా పోటీల్లో కుసుమ రామయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జే.సంతోష్ ప్రతిభ కనబర్చి ఎంపికయ్యాడు. ఈ పోటీలు వచ్చే నెల భద్రాద్రి కొత్తగూడెంలో జరగనున్నాయని గురువారం పాఠశాల హెడ్ మాస్టర్ లకావత్ మోతిలాల్ తెలిపారు. ఉపాధ్యాయులు సంతోష్‌ను సన్మానించి అభినందించారు.
News October 16, 2025
జగిత్యాల: ‘పెన్షనర్ల బకాయిల కోసం రాజీలేని పోరాటం’

పెన్షనర్ల బకాయిల చెల్లింపుల కోసం TGE JAC ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం కొనసాగుతుందని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో జరిగిన TPCA సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి, గౌరీశెట్టి విశ్వనాథం, ప్రకాష్ రావు, యాకూబ్, గంగాధర్, వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.