News December 22, 2025
ములుగు: నలిగిపోతున్న ఆ ‘శాఖ’ సిబ్బంది!

జిల్లాలోని అటవీ శాఖలో కొందరు కిందిస్థాయి సిబ్బంది నలిగిపోతున్నారు. బీటు, సెక్షన్, రేంజ్ స్థాయి వరకు ఉన్నతాధికారులు, రాజకీయ ఒత్తిడి, గ్రామస్థుల తిరుగుబాటుతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అడవుల్లో గుత్తికోయల చట్టవ్యతిరేకమైన నిర్మాణాల కూల్చివేతలపై విధులు నిర్వహిస్తున్న వారిపై దాడులకు వెనుకాడడం లేదని వాపోతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విధులు నిర్వహిస్తున్నామని కుమిలిపోతున్నట్లు సమాచారం.
Similar News
News December 25, 2025
RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు షాక్

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న RCB స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు జైపూర్ పోక్సో కోర్టు షాకిచ్చింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. విచారణ కీలక దశలో ఉండగా బెయిల్ సముచితం కాదని పేర్కొంది. క్రికెట్‌లో సలహాలిస్తానంటూ హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు రాజస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో పోలీసులు దయాల్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే ఆస్కారముంది.
News December 25, 2025
ధాన్యం సేకరణలో NZB జిల్లాకు మొదటి స్థానం

వానాకాలం సీజన్ కుసంబంధించి రాష్ట్రంలో ధాన్యం సేకరణ ముగిసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో మొత్తం 8,447 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం మొత్తం 62,14,099 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం 12,04,591 మంది రైతుల వద్ద నుంచి సేకరించిన ధాన్యం విలువ రూ.14,840.11 కోట్లు. ధాన్యం సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా NZB జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో 7.02Mt లకు గాను 6,93,288 tnలు సేకరించారు.
News December 25, 2025
యలమంచిలి: తండ్రి క్షణికావేశం.. అనాథ అయిన చిన్నారి

క్షణికావేశంలో తండ్రి చేసిన తప్పుకు ఆ చిన్నారి అనాథ అయింది. బుధవారం యలమంచిలి పట్టణంలో <<18659799>>మాయ<<>> అనే వివాహితను భర్త రాకేశ్ కిరాతంగా చంపాడు. వీరికి 4 నెలల చిన్నారి ఉంది. తల్లి (మాయ) మృతి.. తండ్రి (రాకేశ్) కటకటాలపాలయ్యాడు. దీంతో అనాథగా మారిన ఆ చిన్నారిని అధికారులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారులకు అప్పగించారు.


