News March 5, 2025
ములుగు: నేడే పరీక్షలు.. ALL THE BEST

ములుగు జిల్లా వ్యాప్తంగా 3,793 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 1,950, సెకండియర్‌లో 1,843 మంది విద్యార్థులు రాయనుండగా.. 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News September 18, 2025
సిరిసిల్ల: ‘సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలి’

సైబర్ నేరాల నియంత్రణే లక్ష్యంగా పని చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ పి. గీతే సైబర్ వారియర్లకు సూచించారు. సైబర్ నేరాల కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన సైబర్ వారియర్లకు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. సైబర్ నేరాల దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తులో మరింత నైపుణ్యంతో సైబర్ నేరాలను ఛేదించాలని ఆయన వారియర్లను కోరారు.
News September 18, 2025
KNR: ‘ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలి’

అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విద్యానగర్ లోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రపంచమంతా ఒకే సైన్ లాంగ్వేజి ఉండడం ద్వారా అంతర్జాతీయంగా దివ్యాంగులకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు.
News September 18, 2025
పనులు నాణ్యతతో చేపట్టండి: కలెక్టర్

పాణ్యం నుంచి గోరుకల్లు రిజర్వాయర్ వరకు రూ.6.29 కోట్లతో నిర్మించిన రహదారి పనులను కలెక్టర్ జి.రాజకుమారి గురువారం పరిశీలించారు. కొండజుటూరు, గోరుకల్లు, ఎస్.కొట్టాల, దుర్వేసి గ్రామాలను కలుపుతూ 13.125 కి.మీ. పొడవున పూర్తయిన రహదారి పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు, సాగు నీరు, రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ పనుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్పష్టం చేశారు.