News December 1, 2025
ములుగు: పంతాలు, పట్టింపులు లేవు.. అన్నీ పంపకాలే..!?

ఉప్పు నిప్పులా ఉండే అధికార, ప్రతిపక్ష పార్టీలు పల్లెపోరులో పంతం వదులుతున్నాయి. నిన్నటి దాకా ఎదురుపడితే బుసలు కొట్టుకున్న నాయకులు సంధి రాజకీయాలు చేస్తున్నారు. సర్పంచ్, వార్డులను మీకిన్ని.. మాకిన్ని.. అంటూ పంచుకుంటున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసిన పంచాయతీల్లో ఈ పంపకాలు జోరందుకున్నాయి. రంగంలోకి దిగిన జిల్లా నేతలు ఎల్లుండి నామినేషన్ల ఉపసంహరణ లోపు కొలిక్కి తెచ్చేలా మంతనాలు సాగిస్తున్నారు.
Similar News
News December 1, 2025
MDK: కొత్త వైన్ షాపులకు ఎలక్షన్ ‘కిక్కు’

2025-27 సంవత్సరానికి లక్కీడిప్ ద్వారా మద్యం షాపులు దక్కించుకున్న వారు ఈరోజు ఓపెన్ చేశారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు ఉండడంతో షాప్‌లు దక్కించుకున్న వారికి ప్రారంభంలోనే లాభాల కిక్కు కలిసిరానున్నది. ఉమ్మడి జిల్లాలో మెజార్టీ వైన్స్‌లు లిక్కర్ సిండికేట్ల చేతికి చేరాయి. ఎన్నికలు కలిసి రావడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు జోష్‌లో ఉన్నారు. సంగారెడ్డిలో 101, మెదక్ 43, సిద్దిపేటలో 93 షాపులున్నాయి.
News December 1, 2025
GNT: ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా.!

ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు నేడు రాజీనామా చేయటం సంచలనంగా మారింది. వారు కొద్దిసేపటి క్రితం శాసనమండలి ఛైర్మన్‌ను కలిసి తమ రాజీనామాలు సమర్పించారు. రాజీనామా నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీతలు తమ రాజీనామాలను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.
News December 1, 2025
HYD: ఓన్లీ ప్రాఫిట్ నో లాస్ పేరుతో రూ.1.87కోట్ల మోసం

స్టాక్ సలహాల పేరుతో నగరానికి చెందిన కృత్రిమ ఆభరణాల వ్యాపారిని మోసగించిన ఇండోర్‌కు చెందిన ముఖేశ్ పాఠక్‌పై సీసీఎస్ కేసు నమోదు చేసింది. ‘ఓన్లీ ప్రాఫిట్ నో లాస్’ అని నమ్మబలికి 2021 నుంచి 2024 వరకు దశలవారీగా రూ.1.87కోట్లు తీసుకున్న నిందితుడు. చివరికి ఇచ్చిన చెక్ కూడా బౌన్స్ కావడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీసీఎస్ తెలిపింది.


