News March 20, 2025

ములుగు: పది పరీక్షలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ములుగు జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మార్చి 21 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణ విద్యాశాఖ సిబ్బందికి కలెక్టర్ ముందస్తు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, కేంద్రం వద్ద ఇద్దరు పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు ఎలాంటి కరెంట్ కోతలు ఉండవద్దన్నారు.

Similar News

News March 1, 2026

నెల్లూరు గృహ నిర్మాణ శాఖ ఈఈ బదిలీ

image

గృహ నిర్మాణ శాఖ సంస్థ నెల్లూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎంవీ మోహన్ రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి శనివారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఆయనను కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. కాగా మోహన్ రావు స్థానంలో ఇక్కడ ఎవరినీ నియమించలేదు.

News March 1, 2026

రూ.5,456.26 కోట్లతో TTD బడ్జెట్‌.. కీలక అంశాలు!

image

☞ రూ.5,456.26 కోట్లతో 2026-27 వార్షిక బడ్జెట్‌ ☞విద్యాసంస్థల అభివృద్ధికి రూ.118.89 కోట్ల కేటాయింపు ☞ రూ.10.75 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు ☞రూ.20.17 కోట్లతో ఒంటిమిట్టలో 108 అడుగుల జాంబవతుడి విగ్రహం, ఐలాండ్ నిర్మాణం ☞ రూ.8కోట్లతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఎక్స్-రే స్కానర్లు, లోహ గుర్తింపు పరికరాల ఏర్పాటు ☞ భద్రత కోసం తిరుపతిలో 356, తిరుమలలో 371 సిబ్బంది నియామకం.

News March 1, 2026

ఉగ్రసంస్థలకు చేయూత.. చివరకు హతం!

image

ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్నాయి. గాజాలో హమాస్, యెమెన్‌లో హౌతీలు, లెబనాన్‌లో హెజ్బొల్లా సంస్థలకు ఆయుధ, ఆర్థిక పరంగా సాయం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి దేశం చేతిలో అణుబాంబులు ఉంటే అది ప్రపంచానికే ముప్పు అని ట్రంప్, నెతన్యాహు ఆందోళన చెందారు. డీల్ చేసుకోమని ఒత్తిడి చేసినా వినకపోవడంతో సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేశారు.