News March 20, 2025

ములుగు: పది పరీక్షలు.. 144 సెక్షన్ అమలు: SP

image

రేపటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని ఎస్పీ శబరిశ్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసిందన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, లౌడ్ స్పీకర్లు, మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడవద్దన్నారు.

Similar News

News November 9, 2025

విశాఖ: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

image

విశాఖలో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మినగర్‌కు చెందిన టి.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 9, 2025

పాలలో వెన్నశాతం పెరగాలంటే?(1/2)

image

పశువులకు ఇచ్చే దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి. పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి. పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దాణాను వీలైనంత వరకు నానబెట్టి పశువుకు ఇవ్వాలి.

News November 9, 2025

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 5 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డెమాన్‌స్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయసు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://handlooms.nic.in/