News March 18, 2025

ములుగు: ‘పది’ పరీక్ష పదిలంగా!

image

ఈ నెల 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా పరీక్షలు దగ్గర పడటంతో కొంతమంది విద్యార్థులు గాబరా పడి సమాధానం తెలిసినా సరిగా రాయలేకపోతుంటారు. వారంతా ఒత్తిడికి లోనుకాకుండా నేను బాగా చదివాను.. బాగా రాస్తాను అని కాన్ఫిడెంట్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరంతా సెల్‌ఫోన్, టీవీకి దూరంగా ఉన్నట్లయితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జిల్లాలో 3,134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

Similar News

News November 6, 2025

నేడు కేయూలో మౌన దీక్ష

image

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా అష్టాంగ ఆందోళనల్లో భాగంగా మౌన దీక్షలు చేపట్టనున్నారు. కాకతీయ యూనివర్సిటీ SDLCE వద్ద ఉన్న మహాత్మ జ్యోతిబాఫూలే, సావిత్రిబాయి విగ్రహాల వద్ద ఉదయం 10.30 గంటలకు నల్ల రిబ్బన్‌లతో మౌన దీక్ష నిర్వహించనున్నారు.

News November 6, 2025

ఓ వైపు చిరుతలు, మరో వైపు ఏనుగులు.. పవన్ దారెటు.!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తరచూ <<18213730>>చిరుతలు<<>>, ఏనుగుల భయం ప్రజలను వెంటాడుతోంది. అటవీ సమీప ప్రాంతాల్లో చిరుతలు బయటకు వచ్చి పశువులపై దాడి చేస్తున్న ఘటనలు అధికం అవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో <<18203282>>ఏనుగులు<<>> తిష్టవేసి పంట పొలాలను ధ్వంసం చేస్తూ ప్రాణ నష్టమూ కలిగిస్తున్నాయి. మరో రెండు రోజుల్లో అటవీ శాఖ మంత్రి పవన్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

News November 6, 2025

హనుమకొండ: 9న నిరుద్యోగులకు ఉద్యోగ మేళా

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థుల కోసం ఈ నెల 9న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమగ్ర శిక్ష (SSA) ప్రకటించింది. ఈ మేళా హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో జరగనున్నట్లు పేర్కొంది. వృత్తి విద్యా కోర్సులు (IT&ITES, M&E, అగ్రికల్చర్, బ్యాంకింగ్ తదితర) పూర్తి చేసిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్య ఉద్దేశమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.