News November 7, 2025

ములుగు: పాఠశాల నిర్మాణం ఆపారు.. మరి చర్యలేవి!

image

ఏటూరునాగారం మండలం కొమురంభీం గుత్తికోయగూడెంలో అటవీశాఖ అధికారులు పాఠశాల నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పాఠశాల నిర్మాణ పనులు చేపట్టిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు బీట్ అధికారి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. గుత్తికోయల అభివృద్ధి కోసం కడుతున్న పాఠశాల అడ్డుకొని అటవీశాఖ అబాసుపాలవుతుంది.

Similar News

News November 7, 2025

‘మన మిత్ర’ సేవలు ప్రతి ఇంటికి: కలెక్టర్ సిరి

image

కర్నూలు జిల్లాలోని వంద శాతం కుటుంబాలు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకునేలా నేటి నుంచి ప్రతి శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించాలని కలెక్టర్ డా.ఏ.సిరి సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లి సేవలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి కుటుంబం ‘మన మిత్ర’ యాప్ ద్వారా సేవలను వినియోగించుకునేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, జడ్పీ సీఈవోలు, డీఎల్డీవోలు పర్యవేక్షించాలని సూచించారు.

News November 7, 2025

సంగారెడ్డి: ఎస్పీ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

image

వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆధ్వర్యంలో వందేమాతరం గీతాన్ని శుక్రవారం ఆలపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఎఆర్ డీఎస్పీ నరేందర్, ఇన్స్పెక్టర్ రమేష్, కిరణ్ కుమార్, నాగేశ్వర్‌రావ్, ఆర్ఐలు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియెల్, శ్రీనివాస్ రావ్, ఆఫీసు సూపరింటెండెన్స్ అశోక్, మెహనప్ప, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.

News November 7, 2025

రైనా, ధవన్‌.. వీళ్లేం సెలబ్రిటీలు?: సజ్జనార్

image

TG: బెట్టింగ్ యాప్‌లకు <<18217144>>ప్రమోషన్<<>> చేసిన మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌పై HYD సీపీ సజ్జనార్ ఫైరయ్యారు. ‘అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? బెట్టింగ్ బారిన పడి ఎంతో మంది యువకులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? వీళ్లేం సెలబ్రిటీలు?’ అని ట్వీట్ చేశారు.