News November 27, 2025

ములుగు: పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లు పంపిణీ

image

ములుగు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీస్ సిబ్బందికి రైయిన్ కోట్లను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన రెయిన్ కోట్లు, టీ షర్ట్‌లను పంపిణీ చేశామని, పోలీసులు కాలం, సమయంతో సంబంధం లేకుండా 24 గంటలు విధి నిర్వహణలో ఉంటారని, అలాంటి వారికి కాలానుగుణంగా ఇవి తోడ్పడతాయన్నారు.

Similar News

News November 27, 2025

బహు భార్యత్వ నిషేధ బిల్లును ఆమోదించిన అస్సాం

image

బహు భార్యత్వ(పాలిగామీ) నిషేధ బిల్లును అస్సాం అసెంబ్లీ ఇవాళ పాస్ చేసింది. దీని ప్రకారం 2 లేదా అంతకు మించి పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. వివాహం సమయలో ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి దాచిన వారికి పదేళ్ల శిక్ష పడనుంది. ‘ఈ బిల్లు ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. బహుభార్యత్వాన్ని ఇస్లాం అంగీకరించదు’ అని CM హిమంత బిశ్వ శర్మ తెలిపారు.

News November 27, 2025

హైదరాబాద్‌లో మరో మెగా GCC?

image

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. మియామిన్ కార్ప్ సంస్థ ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ(బోయింగ్ లేదా ఎమిరేట్స్) కోసం 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ GCCని నెలకొల్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా 1,000 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.

News November 27, 2025

భూపాలపల్లి: పంచాయతీ ఎన్నికలు.. మొదటి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భూపాలపల్లి జిల్లాలోని 4 మండలాలు గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లిలో 82 గ్రామ పంచాయతీలకు 45 నామినేషన్లు దాఖలయ్యాయి. 712 వార్డులకు 35 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. ఏదైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే 24 గంటలు పని చేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 9030632608 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన చెప్పారు.