News December 19, 2025
ములుగు: ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

ప్రమాదాలు ప్రకృతి విపత్తుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ, సీఎస్ రామకృష్ణారావు సంయుక్తంగా నిర్వహించిన ఈ వీసీలో ములుగు కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. అకస్మాతుగా వచ్చే వరదలు, పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించినప్పుడు వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. మాక్ డ్రిల్స్ నిర్వహించాలన్నారు.
Similar News
News December 23, 2025
ANU: బీటెక్ రివాల్యుయేషన్ పరీక్షా ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులైలో జరిగిన బీటెక్ రీవాల్యుయేషన్ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు మంగళవారం విడుదల చేశారు. I, IV, మొదటి, రెండో సెమిస్టర్, II, IV, మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాలకు వర్సిటీ అధికారిక వెబ్‌సైట్
https://www.nagarjunauniversity.ac.in/ చూడాలన్నారు.
News December 23, 2025
REWIND 2025: ప్రపంచంలో ముఖ్య ఘటనలు

*డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం
* కాథలిక్ చర్చి 267వ పోప్‌గా పోప్ లియో XIV ఎన్నిక
* Gen-Z నిరసనలతో నేపాల్ ప్రభుత్వ మార్పు
* హాంకాంగ్ వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్ అగ్నిప్రమాదంలో 161 మంది మృతి
* జమైకాను వణికించిన మెలిస్సా తుఫాను.. మృతులు 102, 9లక్షల మంది బాధితులు
* మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 గెలిచిన భారత్
* US జోక్యంతో ఇజ్రాయెల్-గాజా కాల్పుల విరమణ
News December 23, 2025
రాజన్న హుండీ ఆదాయం లెక్కింపు.. ఎప్పుడంటే..?

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమన్న ఆలయ పార్కింగ్ స్థలంలో హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనుల నేపథ్యంలో భీమన్న గుడిలో పూజలు, అభిషేకాలు, అర్చనలు, కోడె మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కల్పించిన విషయం తెలిసిందే.


