News March 2, 2026
ములుగు ప్రజావాణిలో 59 వినతులు

ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్‌లో ఉంచకూడదన్నారు.
Similar News
News March 3, 2026
TODAY HEADLINES

✦ మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధం.. ఖమేనీ భార్య మృతి
✦ మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US
✦ సౌదీ, బహ్రెయిన్, ఇజ్రాయెల్ పాలకులకు పీఎం మోదీ ఫోన్
✦ HPV వ్యాక్సిన్ సురక్షితమే: కేంద్రం
✦ యుద్ధం వల్ల కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ.లక్షల కోట్లు ఆవిరి
✦ నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం: CM CBN
✦ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిందే: CM రేవంత్
News March 3, 2026
ఇరాన్ మౌనంగా ఉండదు.. అధ్యక్షుడి వార్నింగ్

అమెరికా-ఇజ్రాయెల్ మానవత్వ విలువలను పట్టించుకోవట్లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ విమర్శించారు. ఆస్పత్రులు, దేశ భవిష్యత్ అయిన స్కూళ్లను టార్గెట్ చేసుకున్నారని ట్వీట్ చేశారు. రోగులు, పిల్లలపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ప్రపంచమంతా దీన్ని ఖండించాలని, తాను దేశం తరఫున నిలబడతానని స్పష్టం చేశారు. ఇరాన్ ఇలాంటి నేరాలకు లొంగిపోదని, మౌనంగా ఉండదని హెచ్చరించారు.
News March 3, 2026
రూ.1000 కోట్లతో ప్రభుత్వ ఆఫీసులకు సొంత భవనాలు!

TG: రాష్ట్రంలోని అద్దె గృహాల్లో ఉన్న ఆఫీసులకు దశలవారీగా సొంత భవనాలు నిర్మించాలని GOVT నిర్ణయించింది. తద్వారా చెల్లిస్తున్న కోట్లాది రూపాయలు అద్దెల భారాన్ని తగ్గించుకోనుంది. మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసులు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, వాటికి నిర్ణీత విస్తీర్ణంలో సొంత భవనాలు నిర్మించాలని CM ఇప్పటికే అధికారులను ఆదేశించారు. వచ్చే బడ్జెట్లో వీటికి ₹1000 CR నిధులు కేటాయించనున్నారు.


