News March 31, 2025
ములుగు: బస్టాండ్ లేక ఇక్కట్లు.. అందుకే ప్రమాదాలు!

మల్లంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు-హనుమకొండ జాతీయ రహదారిపై ఉన్న ఈ మండల కేంద్రంలో బస్టాండ్ లేకపోవడంతో ప్రజలు బస్సుల కోసం జాతీయ రహదారిపైనే నిలబడుతున్నారు. దీంతో తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి బస్టాండ్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Similar News
News April 2, 2025
విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలి: DEO

రోజురోజుకి ఎండలు మండి పోతుండటంతో జిల్లాలోని అన్ని రకాల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తాగు నీరు అందుబాటులో ఉంచాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈవో మాట్లాడుతూ విద్యార్థులకు వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు ఆరోగ్యం పరంగా ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు.
News April 1, 2025
HNK జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ కాజీపేటలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
✓ WGL: RTC బస్సు ఢీ-కొని వ్యక్తి మృతి
✓ స్టేషన్ ఘనపూర్: ట్రాక్టర్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య
✓ చత్తీస్‌ఘడ్‌లో ఎన్కౌంటర్… జనగామ జిల్లా మహిళ మృతి
✓ ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా ఉన్నాడని కత్తితో దాడి
✓ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో రోడ్డు ప్రమాదాల నియంత్రణ సాధ్యం: CP
✓ HNK: షీ-టీంపై మహిళా ఉద్యోగులకు అవగాహన
News April 1, 2025
సైబర్ క్రైమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించండి: SP

జహీరాబాద్ పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లను ఎస్పీ పరితోష్ పంకజ్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లలో ఉన్న రికార్డులను పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ క్రైమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హిస్టరీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులు అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.