News November 13, 2025
ములుగు: బీజాపూర్ ఎన్ కౌంటర్ మృతులు వీరే..!

బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల వివరాలను ఎస్పీ జితేంద్ర వెల్లడించారు. బుచ్చన్న, ఊర్మిళ, జగత్ తామో, దేవి, భగత్, మంగ్లీ ఓయం అనే ఆరుగురు మృతులను గుర్తించామన్నారు. వీరిపై రూ.27 లక్షల రివార్డు ఉందన్నారు. వీరి వద్ద 2 ఇన్సాస్ రైఫిళ్లు, 9 ఎంఎం కార్బన్, 303 రైఫిల్, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయన్నారు.
Similar News
News November 13, 2025
SSC ఫీజు గడువు NOV 20 వరకు పొడిగింపు

TG: టెన్త్ పరీక్షల ఫీజు గడువును నవంబర్ 20 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. నవంబర్ 21 నుంచి 29 వరకు ₹50, డిసెంబర్ 2 నుంచి 11 వరకు ₹200, 15 నుంచి 29 వరకు ₹500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. రెగ్యులర్, ఫెయిల్ అభ్యర్థులు 2026 మార్చిలో జరిగే ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలంది. గడువు లోపు రూ.125 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
News November 13, 2025
NIRCAలో 27 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

రాజమండ్రిలోని ICAR- NIRCAలో 27 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి M.Tech, MSc(అగ్రోనమీ), బీటెక్, BSc, MSc( అగ్రికల్చర్/లైఫ్ సైన్స్/అగ్రికల్చర్ డిప్లొమా, మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/జెనిటిక్స్/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21-45ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: nirca.org.in/
News November 13, 2025
ములుగు: కొనుగోలు కేంద్రాల్లో 3802 మెట్రిక్ టన్నుల ధాన్యం

జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో నేటివరకు 3802.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. ఇందులో 17% తేమతో 1629.760 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి, 1519 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు రవాణా చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో 110.760 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉన్నట్లు తెలిపారు. రూ.0.39 కోట్లు రైతులకు చెల్లించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.


