News February 1, 2025

ములుగు: బీజేపీవి దిగజారుడు రాజకీయాలు: సీతక్క

image

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తుందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని, నిరుద్యోగ సమస్య, ఆర్థిక రంగ ఒడిదుడుకులను కప్పిపుచ్చేందుకే సోనియాగాంధీ వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారన్నారు.

Similar News

News February 1, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు ఇలా..!

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా మంథని 17.6℃, ఓదెల 17.7, కాల్వ శ్రీరాంపూర్ 17.9, రామగుండం 17.9, అంతర్గాం 18.0, జూలపల్లి 18.1, సుల్తానాబాద్ 18.2, పెద్దపల్లి 18.5, కమాన్‌పూర్ 18.8, పాలకుర్తి 19.1, ఎలిగేడు 19.4, ధర్మారం 19.4, రామగిరి 20.3, ముత్తారం 21.8℃గా నమోదయ్యాయి. మీ ప్రాంతంలో చలి తీవ్రంగా ఉందా కామెంట్ చేయండి. 

News February 1, 2025

కాంగ్రెస్ MLAల రహస్య సమావేశం?

image

TG: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్-5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

News February 1, 2025

బుట్టాయిగూడెం: విషాదం.. తల్లీబిడ్డ మృతి

image

అల్లూరి జిల్లాకు చెందిన గర్భిణి మధుబాల (23) బుట్టాయిగూడెం మండలంలో నివాసం ఉంటుంది. గురువారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఏలూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం తెల్లవారుజామున మృత శిశువుకు వైద్యులు పురుడు పోశారు. కాసేపటికి ఆ తల్లి కుడా మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.