News April 3, 2025
ములుగు: బీజేపీ నాయకుడిపై పొక్సో కేసు

వెంకటాపురం BJP అధ్యక్షుడిపై పొక్సో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ కుటుంబం కూలీ పని కోసం బెస్తగూడెంకి వచ్చారు. MARCH 31న ఓ బాలిక బోరు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఇంటికి తీసుకెళ్తానని బైక్ ఎక్కించుకుని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్రమత్తమైన బాలిక దూకి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు PSలో ఫిర్యాదు చేశారు.
Similar News
News April 4, 2025
వనపర్తి: అమ్మాయిల వెంట పడితే ఇక అంతే..!

పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గిరిజనుల సంక్షేమ పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. వి.రజని మాట్లాడుతూ.. బాల బాలికలను వివిధ రకాలైన లైంగిక వేధింపుల నుంచి రక్షించడానికి ఏర్పాటు చేసినట్లు ఉదాహరణలతో వివరించారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు.
News April 4, 2025
నార్నూర్: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
భూ ఆక్రమణదారులకు మంచిర్యాల కలెక్టర్ వార్నింగ్

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో భాగంగా కోర్టులో కొనసాగుతున్న కేసుల సంబంధిత భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.