News September 14, 2025
ములుగు: బుల్లెట్ బండిపై SP, మంత్రి సీతక్క..!

మంత్రిననే హోదాను పక్కనబెట్టి సాధారణ వ్యక్తిగా వ్యవహరించడం సీతక్క నైజం. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే ఆమె ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ఆదివారం మేడారం జాతర పనుల పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి ములుగు SP శబరీష్ బుల్లెట్ బైక్ నడుపుతుండగా వెనుక కూర్చొని జాతర జరిగే పరిసరాలను పరిశీలించారు. రోడ్లు, పార్కింగ్ స్థలాలు, ట్రాఫిక్ ఏర్పాట్లపై సమీక్షించారు. జాతర నిర్వహణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News September 14, 2025
అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు..?

పాకాల(M) సమీపంలోని అటవీ ప్రాంతంలో రెండు మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. ఓ వ్యక్తి మృతదేహం చెట్టుకు వేళాడుతుండగా, మరో మహళ డెడ్ బాడీ నేలపై ఉంది. అవి గుర్తు పట్టలేనంతగా మారినట్లు పోలీసులు తెలిపారు. అక్కడే మరో రెండు గుంతలు తవ్వి, వాటిపై బండరాళ్లను ఉంచారు. ఆ గోతిలో చిన్న పిల్లల మృతదేహాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News September 14, 2025
కాంగ్రెస్ వల్లే విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి: హరీశ్ రావు

TG: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని BRS MLA హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. రీయింబర్స్‌మెంట్, ఉద్యోగులకు జీతాలు చెల్లించకుండా ప్రాజెక్టులకు ₹కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే తక్కువ కాలంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన విద్యాశాఖ మంత్రిగానూ రేవంత్ నిలిచిపోతారన్నారు.
News September 14, 2025
ఖమ్మం: వ్యభిచార గృహంపై దాడి.. కేసు నమోదు

బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, ఎస్‌ఐ పొదిలి వెంకన్న ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఓ విటుడు, ఓ మహిళ, నిర్వాహకురాలు మంగమ్మను పట్టుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.