News February 28, 2025
ములుగు: బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు?

ములుగు జిల్లాలో రైతులకు సకాలంలో వరి ధాన్యం బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 11,379 మంది రైతులు నుంచి వరి ధాన్యాన్ని సేకరించగా.. 4,885 మంది రైతులకు రూ.15.64 కోట్లు చెల్లించారు. మిగిలిన 6,494 మంది రైతులకు రూ.19.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.
Similar News
News February 28, 2025
మంగళగిరి: చేనేత జౌళి శాఖ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, బడ్జెట్లో రూ.2000 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేస్తూ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంగళగిరి చేనేత జౌళి శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం కమిషనర్ రేఖారాణి కి వినతిపత్రం ఇచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, అధ్యక్షులు కె శివ దుర్గారావు మాట్లాడుతూ చేనేత సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
News February 28, 2025
గౌరారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

గౌరారం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ టీచర్స్ కాలనీకి చెందిన శ్యామ్ బహదూర్ సింగ్ (41), చందు యాదవ్, సాయి కుమార్ రాయపోల్ నుంచి మేడ్చల్ వెళ్తున్నారు. గౌరారం రాజీవ్ రహదారిపై హైదరాబాద్ నుంచి వస్తున్న ట్రక్‌ని కారు ఢీ కొట్టింది. శ్యామ్ బహదూర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరికి గాయాలు తగిలాయి.
News February 28, 2025
అకౌంట్లోకి డబ్బులు.. కీలక ప్రకటన

TG: రైతుభరోసా డబ్బుల జమపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతన్నలకు నిధుల విడుదల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా లబ్ధిదారుల వివరాలను ప్రదర్శించాలని పేర్కొన్నారు. రైతులకు అందుతున్న ఆర్థిక సాయం, పథకాల అమలు పురోగతిపై బ్యాంకర్లతో చేసిన సమీక్షలో మంత్రి ఈ మేరకు నిర్ణయాలు ప్రకటించారు.