News January 3, 2026
ములుగు: భారీ ఎన్ కౌంటర్.. 14 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్ జరిగిన రెండు వేర్వేరు చోట్ల భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు 14 మంది నక్సలైట్లను హతమార్చాయి. సుక్మాలోని కిష్టారామ్ ప్రాంతంలో 12 మంది, బీజాపూర్‌లో ఇద్దరు మృతి చెందారు. బీజాపూర్లో మృతి చెందిన ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని, రెండు వైపుల నుంచి అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని పోలీసులు ధ్రువీకరించారు.
Similar News
News January 10, 2026
KNR: ‘పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి’

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌లోని పలు పోలింగ్ కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల మధ్య నిర్ధేశిత దూరాన్ని పాటించాలని, విద్యుత్, తాగునీరు, లైటింగు, వికలాంగుల సౌకర్యార్థం ర్యాంపులను ఏర్పాటుచేయాలన్నారు.
News January 10, 2026
వరంగల్ కొత్త కలెక్టరేట్‌లో గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయం!

వరంగల్‌లో ప్రారంభానికి సిద్ధమైన కలెక్టర్ కార్యాలయం గ్రేటర్ WGL కార్పొరేషన్‌కు కేటాయిస్తారని చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్న జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని ప్రకటించిన క్రమంలో వరంగల్-హనుమకొండ జిల్లాలను ఒకటి చేసే అవకాశం ఉంది. రెండు జిల్లాల్లో ఒకటి చేయాలని పౌర సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తున్న క్రమంలో రెండు జిల్లాలను ఒకటి చేసి కొత్త కలెక్టరేట్‌ను బల్దియాకు కేటాయించనున్నట్లు సమాచారం.
News January 10, 2026
APMSRB: 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యసేవల నియామక బోర్డు(APMSRB) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు ఈ నెల 12వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి 11.59గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ <


