News December 15, 2025
ములుగు: భార్య సర్పంచ్.. భర్త వార్డు మెంబర్..!

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ములుగు మండలం ఖాసీందేవిపేట సర్పంచ్‌గా వాంకుడోతు నిరోషా గెలిచారు. ఆమె భర్త అమర్ సింగ్ 6వ వార్డు నుంచి వార్డు సభ్యుడిగా విజయం సాధించారు. ఒకే పంచాయతీ కార్యవర్గంలో భార్య సర్పంచ్‌గా, భర్త వార్డు సభ్యుడిగా ఉండటంతో సర్వత్రా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అమర్ సింగ్ కాకతీయ విశ్వ విద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందారు.
Similar News
News December 16, 2025
HILTP లీక్ వెనుక ఓ మంత్రి, సీనియర్ IAS!

TG: <<18457165>>HILTP<<>> లీక్ కేసులో విజిలెన్స్ విచారణ ముగిసింది. CM రేవంత్‌కు విచారణ నివేదికను అధికారులు అందించారు. ఓ మంత్రి, సీనియర్ IAS అధికారి పాలసీ వివరాలు లీక్ చేశారని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ తరువాత BRS నేతలకు వాటిని చేరవేశారని తేల్చారు. మంత్రి సూచనతో అలా చేశానని అధికారి చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా అధికారి కావాలనే మంత్రిని ఇరికిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.
News December 16, 2025
కరీంనగర్: ఎన్నికల బందోబస్తుకు 877 మంది పోలీసు సిబ్బంది

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 ఇన్స్పెక్టర్లు, 39 ఎస్సైలు, 40 ఏఎస్సైలు/హెడ్ కానిస్టేబుల్స్, 460 కానిస్టేబుళ్లు, 35 స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 హోంగార్డులు, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులు, అదనంగా ఎన్‌సీసీ సభ్యులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.
News December 16, 2025
విజయోత్సవ ర్యాలీలపై నిషేధం: సీపీ గౌస్ ఆలం

సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం అదే రోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం అని సీపీ గౌస్ ఆలం స్పష్టం చేశారు. రేపు జరగనున్న మూడో దశ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలు తీసిన సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


