News January 13, 2026
ములుగు: మద్దతిచ్చిన జిల్లాకు మంగళం పాడుతారా..!?

రాష్ట్రంలో చిట్టచివరన ఏర్పడ్డ జిల్లా ములుగు. జిల్లా కోసం రాజకీయ, ప్రజా, జర్నలిస్టు సంఘాల చేసిన పోరాటానికి విపక్ష నేతగా నేటి సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా నిలిచారు. జర్నలిస్టుల పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని సర్కారును నిలదీశారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగివచ్చింది. 2019 ఫిబ్రవరి 17న జిల్లా మనుగడలోకి వచ్చింది. జిల్లాల కుదింపు అంశం నేడు తెరపైకి రాగా సీఎం స్పందన, ‘ములుగు’ భవిష్యత్‌పై ఆసక్తి నెలకొంది.
Similar News
News February 10, 2026
గాయిటర్ వ్యాధి గురించి తెలుసా?

థైరాయిడ్ గ్రంథి అసాధారణమైన సైజుకు పెరగడాన్నే గాయిటర్ అంటారు. ఇది రెండు రకాలు. సాధారణం కంటే థైరాయిడ్ గ్రంథి ఉబ్బిపోవడాన్ని డిఫ్యూస్ గాయిటర్ అని, థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు పెరగడాన్ని నాడ్యులార్ గాయిటర్ అని అంటారు. దీనివల్ల గొంతు దగ్గర బాగా ఉబ్బడం, థైరాయిడ్ హార్మోన్ స్రావంలో హెచ్చుతగ్గులు వస్తాయి. నిర్ధారణ కోసం థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్షలు T3, T4, TSH, అల్ట్రాస్కాన్, NFAC పరీక్షలు చేస్తారు.
News February 10, 2026
గాయిటర్ వ్యాధి చికిత్స

థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా గాయిటర్ సమస్యను ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.
News February 10, 2026
టెన్త్ విద్యార్థినితో టీచర్ పెళ్లి.. చివరికి!

TG: పాఠాలు నేర్పాల్సిన గురువే విద్యార్థినికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. మేడ్చల్ పోచారం పరిధిలోని ఓ స్కూల్‌లో మైటీన్(27) టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే స్కూల్‌లో టెన్త్ చదువుతున్న బాలికను లోబరుచుకొని పెళ్లి చేసుకున్నాడు. బాలిక మెడలో తాళిని చూసిన కుటుంబ సభ్యులు ఆరాతీయడంతో అసలు విషయం బయటపడింది. వారి ఫిర్యాదుతో టీచర్‌పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అతణ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


