News March 11, 2025

ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

image

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.

Similar News

News March 11, 2025

మంత్రిత్వ శాఖ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న కలెక్టర్

image

న్యూఢిల్లీ నుంచి భారత ప్రభుత్వం, జల్ శక్తి మంత్రిత్వ శాఖవారు జల్ శక్తి అభియాన్ “జల్ సంచయ్ జన్ భగీదారి”పై అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. “జెల్ సంచయ్ జన్ భగీదారి”పై దృష్టి సారించి వర్షాన్ని ఒడిసి పట్టీల చర్యలు చేపట్టాలని సోమవారం అన్నారు. జిల్లాలలో పురోగతిపై వర్చువల్ విధానంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమీక్ష నిర్వహించారు.

News March 11, 2025

జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

image

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.

News March 11, 2025

HYD: ఆరోగ్య సేవలకు ప్రత్యేక యాప్: MD 

image

ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో సోమవారం స‌త్వ‌ర ఆరోగ్య సేవ‌ల‌కు ప్ర‌త్యేక యాప్ ను ఎండీ అశోక్ రెడ్డి ప్రారంభించారు. జ‌ల‌మండ‌లి ఉద్యోగుల ఆరోగ్య సేవ‌ల కోసం ప్ర‌త్యేక యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. మెడ్ ఫ్లాష్ అనే మొబైల్ అప్లికేష‌న్ ద్వారా రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉచిత సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చన్నారు. 

error: Content is protected !!