News July 8, 2025

ములుగు మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా రేపు కళ్యాణి ప్రమాణ స్వీకారం

image

ములుగు మార్కెట్ యార్డు కమిటీ ఛైర్‌పర్సన్‌గా మహిళా కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షురాలు రేగ కళ్యాణి నియామకమైన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కళ్యాణి మొదట కామారం సర్పంచ్‌గా పని చేశారు. అనతి కాలంలోనే పార్టీ ఆమె సేవలను గుర్తించి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. తన సేవలను గుర్తించిన మంత్రి సీతక్కకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News July 8, 2025

సమ్మెకు దూరంగా ఉండండి: జీఎం విజయభాస్కర్ రెడ్డి

image

కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటిలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. పలు రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న మన కంపెనీని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఒక రోజు పని గంటలు నష్టపోతే కంపెనీ వెనుకంజ వేయాల్సి వస్తుందని తెలిపారు.

News July 8, 2025

చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

image

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

News July 8, 2025

ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

image

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.