News November 18, 2025
ములుగు: మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా తెలంగాణ?

మోస్ట్ వాంటెడ్, సీసీ కమిటీ మెంబర్ మడవి హిడ్మా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లో వేల సంఖ్యలో జవాన్లు అడవుల్లో జల్లడ పడుతుండడం, వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు దళాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రస్తుతం కాల్పుల విరమన ఉండటంతో మావోయిస్టులకు సేఫ్ జోన్ కానుందని తెలుస్తోంది. కాగా మావోయిస్టులు సైతం తెలంగాణలో మరో 6 నెలల పాటు సీజ్ ఫైర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Similar News
News November 18, 2025
గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ), ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున, జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావచ్చని కలెక్టర్ కోరారు.
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
వైద్య అధికారులకు పల్నాడు కలెక్టర్ ఆదేశాలు

ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు సంబంధించిన అన్ని బకాయిలను 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సత్తెనపల్లి, చిలకలూరిపేట, నరసరావుపేట ఏరియా ఆసుపత్రుల వైద్య అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టులో ఉన్న సౌకర్యాల స్థాయిని, నిధుల ఉత్పత్తిని కలెక్టర్ సమీక్షించారు.


