News February 1, 2025

ములుగు: మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలి: స్వాతి లక్రా

image

మావోయిస్టు కార్యకలాపాలపై నిఘా పెట్టాలని హోంగార్డ్స్, ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అన్నారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ.. జిల్లాలో సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శాంతి భద్రత నియంత్రణలో తీసుకుంటున్న చర్యలపై ఎస్పీ శబరీశ్ పవర్ పాయింట్ ద్వారా డీజీపీకి వివరించారు.

Similar News

News December 28, 2025

అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

image

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <>వీడియో<<>> రిలీజ్ చేశారు.

News December 28, 2025

పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

image

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.

News December 28, 2025

రాజమండ్రి: జనవరి 5న రేషన్ బియ్యం బహిరంగ వేలం

image

జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన 33.85 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జనవరి 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ ఆదివారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద గల పౌరసరఫరాల కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. జనవరి 3న నమూనాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు ఈ వేలానికి అనర్హులని స్పష్టం చేశారు.