News November 18, 2025

ములుగు: మావోయిస్టు హిడ్మా నేపథ్యం!

image

ఏపీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా మృతి చెందిన విషయం తెలిసిందే. సుక్మాలోని పూర్వర్తికి చెందిన మడవి హిడ్మాపై రూ.కోటి రివార్డు సైతం ఉంది. చిన్నతనంలోనే మావో సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు. ఏరియా కమిటీలో, DVCM(డివిజనల్ కమిటీ సభ్యుడు), DKSZC(దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ) తర్వాత సీసీ కమిటీ మెంబర్‌గా ప్రస్తుతం కొనసాగాడు.

Similar News

News November 18, 2025

పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

image

ఖమ్మం: జిన్నింగ్‌ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.

JGTL: PM శ్రీ ల్యాబ్‌ల ఏర్పాటులో జాప్యమెందుకు..?

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో సామర్థ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు రూ.3.54 కోట్లతో మొత్తం 18 ల్యాబ్‌లను మంజూరు చేయగా, ఇప్పటికీ కేవలం 3 మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 15 ల్యాబ్‌ల పనులు కొనసాగుతున్నాయి. రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు.